Lyrics

Hit songs

...........................................................................................

ప్రేమదేశo



ప్రేమా.... ప్రేమా.... ప్రేమా ప్రేమా.....
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా...
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా...
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి
రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా...

ఆకాశదీపాన్నై నే వేచిఉన్నా నీ పిలుపుకోసం చిన్నారి
నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి
నా గుండె లోతుల్లో దాగుంది నీవే
నువు లేక లోకంలో జీవించలేనే
నీ ఊహతోనే బ్రతికున్నా....
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా...
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా...

నిముషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడి చేర్చుకోవా వయ్యారి
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా ఓదార్చిపోవా ఓసారి
ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమా
ప్రేమించినానంటూ బ్రతికించలేవా
అది నాకు చాలే చెలీ.....
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా...
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా...
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి
రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనే మరచినా నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా...
...........................................................................................

వాన



ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో…
ఎదను తడిమింది చూడు… చినుకంటి చిన్నదేమో…
మైమరచిపోయా మాయలో… ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా…. || ఎదుట ||

నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి…
కలే ఐతె ఆ నిజం… ఎలా తట్టుకోవాలీ…..
అవునో కాదో అడగకంది నా మౌనం….
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం….
చెలిమి బంధం అల్లుకుందే… జన్మ ఖైదులా… || ఎదుట ||

నిన్నే చేరుకోలేకా… ఎటెళ్ళిందో నా లేఖ…
వినేవారు లేకా…. విసుక్కుంది నా కేకా…
నీదో… కాదో… వ్రాసున్న చిరునామా
ఉందో… లేదో… ఆచొట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా… || ఎదుట ||
...........................................................................................

మoచిమనసులు


జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా (2)
ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా
నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలు గా
ఊహల్లో తేలీ ఉర్రూతలూగి మేఘాలతొటి రాఘాల లేఖ
నీకంపినాను రావా దేవి
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై


నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా (2)
ఉండీ లేకా వున్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాశల రూపం నీవే
దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నా దన్నదంతా నీవే నీవే
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై (4)
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

...........................................................................................

నవ్వు నాకు నచ్చావ్



నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు
తాను పలికితె చాలు తేనె జలపాతాలు
ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది
ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది
చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా
తన కురులు చూపిస్తా అవుననక చస్తారా

గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెల
కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో
గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా
మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో
అలా నడిచి వస్తూంటే పూవుల వనం
శిలైపోని మనిషుంటే మనిషే అనం
గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం

ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను
గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసిదనం
రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను
కలో కాదో నాకే నిజం తేలక
ఎలా చెప్పడం తాను నాకెవ్వరో
అదిరి పడకయ్యా ఇది ఆమె మాయ
ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ

...........................................................................................

నవ్వు నాకు నచ్చావ్



నా చూపే నిను వెతికినది
నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది
నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది
నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు
నీకే నీకే చెప్పాలి అంటున్నది

నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం
నాలో నిలవని నా హృదయం ఏమౌతుందని చిన్న భయం
గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే
వేలు పట్టి నడిపిస్తాలే నా వెంటే నీవుంటే

పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహం
అడుగులు సాగని సందేహం చెరిపేదెలాగ ఈ దూరం
దిగులు కూడ తీయగలేదా ఎదురు చూస్తూ ఉంటే
పగలు కూడ రేయైపోదా నీవుంటే నా వెంటే
...........................................................................................

నవ్వు నాకు నచ్చావ్



ఒక్క సారి చెప్పలేవా
ఒక్క సారి చెప్పలేవా నువ్వు నచ్చావని
చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుకున్న వేళ
వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి
నిదురపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి

చందమామ మనకందదని ముందుగానె అది తెలుసుకుని
చేయిజాచి పిలవద్దు అని చంటిపాపలకు చెబుతామా
లేనిపోని కలలెందుకని మేలుకుంటె అవి రావు అని
జన్మలోనె నిదరోకు అని కంటిపాపలకు చెబుతామా
కలలన్నవి కలలని నమ్మనని
అవి కలవని పిలవకు కలవమని
మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా

అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరుజల్లులతో
చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా
అంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితో
కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా
మనసుంటే మార్గం ఉంది కద అనుకుంటే అందనిదుంటుందా
అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా

...........................................................................................

నవ్వు నాకు నచ్చావ్



ఉన్నమాట చెప్పనీవు
ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ
నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ
అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కద
మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కద
పంతం మానుకో భయం దేనికో

వద్దన్నకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక
నిద్దర్లో కూడ వంటరిగా వదలవుగా
నన్నాశపెట్టి ఈ సరదా నేర్పినదే నువ్వు గనక
నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా
అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా
అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువు తొందరగా
ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా

ఆమాయకంగ చూడకలా వేడుకలా చిలిపి కల
అయోమయంగ వెయ్యకలా హాయి వల
నీ మీదకొచ్చి ఉరితాడై వాలదుగా వాలు జడ
దానొంక చూస్తే ఎందుకట గుండె ధడ
మరి మరి శృతి మించి ఇలా నను మైమరపించకలా
తడబడి తల వంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా
మరేం చెయ్యనే నీతో ఎలా వేగనే

...........................................................................................

నవ్వు నాకు నచ్చావ్



ఆకాశం దిగివచ్చి
ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరి సగమవమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం
ఇదివరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం
మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవీ గాలులే

చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు
ఆ సొంపులకు ఎర వేసే అబ్బాయి చూపు తొందరలు
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో
తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా
ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా

విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు
సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసవిసలు
సందు చూసి చక చక ఆడే జూద శిఖామణులు
పందిరంతా ఘుమ ఘుమలాడే విందు సువాసనలు
తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా

...........................................................................................

మగధీర



పంచదార బొమ్మా బొమ్మా...పట్టుకో వదనకమ్మ ....
మంచుపూల కొమ్మ కొమ్మ... ముట్టుకో వదనకమ్మ ...
చేతినే తాకోదంటే, చెంత కే రావోదంటే ఏమవుతానమ్మా...

నిన్ను పొందేటందుకు పుట్టనే గుమ్మ ..
నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ ...
నిన్ను పొందేటందుకు పుట్టనే గుమ్మ ..
నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ .ఆ ఆ ఆ ఆ ..

పువ్వు పైన చేయేస్తే,కసిర నన్ను తిట్టిందే..
పసిడి పువ్వు నువ్వని పంపిందే ...
నువ్వు రాక నా వెంటయే,భూమి చుట్టూ ముల్లంట,అంటూ కుంటే మంటే వొల్లంత ...
తీగ పైన చేయేస్తే , తిట్టి నన్ను నేట్టిందే
మెరుపు తీగ నువ్వని పంపిందే ..
మెరుపు వెంట ఉరుమంట, ఉరుము వెంట వరదంట ...నే వరద లాగ మారితే ముప్పంట ...
వరదయిన వరమని భరిస్తానమ్మ ...
పునకైన సుఖమని వడేస్తానమ్మ...
నిన్ను పొందేటందుకు పుట్టనే గుమ్మ ..
నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ .ఆ ఆ ఆ ఆ ..

గాలి నిన్ను తాకింది,నేల నిన్ను తాకింది..
నేను నిన్ను తాకితేతప్పా ...
గాలి ఊపిరయ్యింది, నేల నన్ను నడిపింది..
ఏమిటంట నీలోని గొప్ప...
వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడా తాకింది, పక్షపాతమేందుకు నా పైన ..
వెలుగు దారి చూపింది, చినుకు లాల పోసింది, వాటితోటి పోలిక నీకెలా ...
అవి బ్రతికున్నప్పుడే తోడుఉంటాయమ్మా ..
నీ చితిలో తోడే నేనోస్తనమ్మ ..
నిన్ను పొందేటందుకు పుట్టనే గుమ్మ ..
నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ .ఆ ఆ ఆ ఆ ..

...........................................................................................

మహాత్మ



రఘుపతి రాఘవ రాజ రామ్, పతీత పావన సీత రామ్
ఈశ్వర అల్ల తేరో నాం,సబ కో సన్మతి దే భగవాన్
కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ ..
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ..... ||కొంతమంది||
కరెన్సీ నోట్ మీద ....ఇలా నడి రోడ్ మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమయాతన తీర్చిన వరదాతరా గాంధీ ...... ||కొంతమంది ||

రామ నామమే తలపంత ...ప్రేమ దామమే మనసంత
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవదూత
అపురూపం ఆ చరిత
కర్మ యోగమే జనమంతా
ధర్మ క్షేత్రమే బ్రతుకంత
సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్ గీత..ఈ బొసి నోటి తాత
మనలాగే ఓ తల్లి కన్నా మామూలు మనిషి కదరా గాంధీ
మహాత్ముడంటు మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి
సత్య అహింసల మార్గాజ్యోతి
నవ శకానికే నాంది

రఘుపతి రాఘవ రాజ రామ్, పతీత పావన సీత రామ్
ఈశ్వర అల్ల తేరో నాం,సబ కో సన్మతి దే భగవాన్ ||రఘుపతి||
గుప్పెడు ఉప్పును పోగేసి..నిప్పుల ఉప్పెన గా చేసి
దండి యాత్రనే దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత..సిసలైన జగ్గజేత ...
చరకా యంత్రం చూపించి ..స్వదేశి సూత్రం నేర్పించి
నూలు పోగుతో మాధపుటెనుగల బందిచాడురా జాతిపిత ...సంకల్ప బలం చేత....
సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తుర్పు తెల్లారని నడిరాత్రికి స్వేచా బాణుడి ప్రభాత కాంతి
పదవులు కోరని పావని మూర్తి
హృదయలేలిన చక్రవర్తి

ఇలాంటి నరుడొక డిలాతలంపై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరనిదని నమ్మకముందే ముందు తరాలకి చెప్పండి
"సర్వ జన హితం నా మతం ...
అంటరాని తనాన్ని అంతః కలహాలని అంతం చేసేందుకే నా ఆయువంత అంకితం "
హే రాం